image



వచ్చే దశాబ్దం నాటికి భూతాపంలో 1.5 డిగ్రీల పెరుగుదల




→పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే.. వచ్చే 10-15 ఏళ్లలో భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుందని కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో జరిగిన అధ్యయనం తేల్చింది. 
 
→హానికారక ఉద్గారాలను  తగ్గించినప్పటికీ ఇది తప్పదని పేర్కొంది. 
 
→రానున్న కొన్ని దశాబ్దాల్లో ఈ వాయువుల మోతాదు బాగా పెరిగితే ఈ శతాబ్దం మధ్య నాటికి పుడమి ఉష్ణోగ్రత సరాసరిన 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరగొచ్చని కూడా హెచ్చరించింది.
 
→ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి ఉష్ణోగ్రతలను పరిశీలించి భవిష్యత్లో వాతావరణ మార్పులపై ఈ లెక్కలను కట్టింది.
 
→ప్రపంచ దేశాలు 'శూన్య ఉద్గార స్థాయి'కి చేరుకోవడానికి మరో 50 ఏళ్లు పడితే భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 
 
→ఆ దిశగా వేడి ఇప్పటికే పెరిగిందని వివరించారు. ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో పెరగడమంటే 2015 నాటి పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో విఫలం కావడమేనని వారు పేర్కొన్నారు. 
 
→ఈ అధ్యయనంలో న్యూరల్ నెట్వర్క్ అనే ఏఐని ఉపయోగించారు.
 



Science