image



దేశంలోని 9 రాష్ట్రాల్లో పర్యావరణానికి హాని




→ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్రాంతాల జాబితాలో మొదటి 50 స్థానాల్లో భారత్ లోని 9 రాష్ట్రాలు ఉన్నాయి.
 
→ 2050లో పర్యావరణానికి హాని కలి గించే 2500కు పైగా రాష్ట్రాలు, ప్రావిన్సుల్లోని వాతావరణ మార్పులను క్రాస్ డిపెండెన్సీ ఇని షియేటివ్(ఎక్స్ఐ) గణించింది. 
 
→ వరదలు, అడ వుల్లో మంటలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని పర్యావరణ హానికారకాల ప్రాంతాల వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. 
 
→ పర్యావరణానికి    విఘాతం కలిగించే ప్రపంచంలోని మొదటి 50 స్థానాల్లో భారత్ లోని బిహార్ (22), ఉత్తర్ ప్రదేశ్ (25), అస్సాం (28), రాజస్థాన్ (32), తమిళనాడు(36), మహారాష్ట్ర(38), రాత్(48), పంజాబ్ (50), కేరళ (52) ఉన్నాయి.
 
→ 2050 నాటికి హాని కలిగించే మొదటి 50 స్థానాల జాబితాలో చైనా, అమెరికా, భారత్ నుంచే 80 శాతం రాష్ట్రాలు ఉండటం గమ నార్హం. 
 
→ భారత్లోని అస్సాం రాష్ట్రంలో 1990లో పోల్చితే 2050 నాటికి పర్యావరణాన్ని దెబ్బతీసే పరిస్థితులు 330 శాతానికి పైగా పెరగనున్నా యని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది.
 



National