image



కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో 'మిషన్ కర్మయోగి' అమలు కమిటీ




→ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల శిక్షణకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'మిషన్ కర్మయోగి' కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 
 
→కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలోని ఈ కమిటీలో పీఎంవో నుంచి ఒక సీనియర్ అధికారి, వివిధ శాఖల నుంచి ఏడుగురు కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని అధికార వర్గాలు  వెల్లడించాయి. .
 
→నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ (ఎన్పీసీఎస్సీబీ) లేదా మిషన్ కర్మయోగి కింద నిర్దిష్ట విధానాన్ని రూపొందించే ప్రక్రియలో భాగంగా కేబినెట్ సెక్రటేరియట్ సమన్వయ విభాగాన్ని (సీఎస్సీయూ) ఏర్పాటు చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది. .
 
→ఎన్పీసీఎస్ సీబీ అమలును సీఎస్సీయూ పర్యవేక్షిస్తుందని ఆదేశాలు జారీ చేసింది ఈ ఏడాది జనవరి నాటికి సమీకృత ప్రభుత్వ ఆన్లైన్ శిక్షణ (ఐజీవోటీ) కర్మ యోగి డిజిటల్ లెర్నింగ్ వేదికపై 1,532 మంత్రిత్వశాఖలు/విభాగాలు, సంబంధిత సంస్థలు 341 కోర్సులను ప్రారంభించగా, 3,13,367 మంది ఇందులో శిక్షణకు నమోదు చేసుకున్నారు. .
 
→వీరంతా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ లకు చెందిన అనుభవజ్ఞులు/నిపుణులతో సంప్రదింపులకు గాను గత నెలలో 'కర్మయోగి టాక్స్ సిరీస్'ను ప్రారంభించారు.
 



National