image



దెబ్బతిన్న గుండెకు ప్రొటీన్ తో చికిత్స




→ గుండెకు మరమ్మతులు చేయడానికి సాయపడే ఒక 'రీకాంబినెంట్ ప్రొటీన్ టూల్బాక్స్' ను గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆరు ప్రత్యేక ప్రొటీన్లు ఉంటాయి. 
 
→ ఇవి.. మానవ చర్మం నుంచి సేకరిం చిన కణాలను గుండె కణాలుగా మార్చడానికి ఉప యోగపడతాయి. ఇవి అచ్చం గుండె కణాల తర హాలోనే పనిచేస్తాయి. 
 
→ దెబ్బతిన్న హృదయ కణ జాల పునరుజ్జీవనానికి వీటిని వాడొచ్చు. గుండె లోని ఒక భాగం దెబ్బతిన్నప్పుడు గుండెపోటురావొచ్చు. జీబ్రా ఫిష్ వంటి కొన్ని జీవుల్లో.. దెబ్బ తిన్న గుండె తిరిగి వృద్ధి చెందుతుంది. మానవుల్లో ఇలాంటి ప్రక్రియ ఉండదు. 
 
→ కొత్త గుండె కణాలు వృద్ధి చెందడానికి బదులు 'స్కార్' కణజాలం ఏర్ప డుతుంది. పూర్తిగా దెబ్బతిన్న గుండెకు మార్పిడి ఒక్కటే పరిష్కారం. 
 
→ అయితే ఇందుకు సరిపడా అవయవాలు అందుబాటులో ఉండటంలేదు. పైగా మార్పిడి చేసినా.. దాన్ని రోగి శరీరం సాఫీగా స్వీకరిస్తుందా అన్నది అనుమానమే. 
 
→ ఈ నేప థ్యంలో సాధారణ కణాలను గుండె కణాలుగా మార్చడానికి ఉన్న అవకాశంపై శాస్త్రవేత్తలు చాలాకా లంగా పరిశోధనలు చేస్తున్నారు. 
 
→ దెబ్బతిన్న గుండె పునరుజ్జీవనానికి ఇవి సాయపడతాయని వారు తెలి పారు. అయితే మార్పిడి ప్రక్రియలో కణాలు హానిక రంగా మారొచ్చు. 
 
→ అందువల్ల సురక్షితమైన విధానా లపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. కణాల పనితీ రును మార్చే ప్రక్రియను సెల్యులార్ రీప్రోగ్రామిం గా గా పేర్కొంటారు. 
 
→ ఇందులో నిర్దిష్ట ప్రొటీన్లను ఉప యోగించాలి. అవి.. సంబంధిత కణంలోని జన్యు వుల వ్యక్తీకరణను మార్చేస్తాయి. కణానికి కొత్త గుర్తింపును ఇస్తాయి. 
 
→ ఇలాంటి రీకాంబినెంట్ ప్రొటీ న్లను ఐఐటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.
 



Science