image



భూకంపాల గుట్టును విప్పే పగుళ్లు




 
→భారీ భూకంపాల ఆస్కారాన్ని పసిగట్టే దిశగా అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 
 
→భూపకాలకు సంబంధిం చిన ఒక ప్రక్రియ  ఇందులో కీలకం కానుందని తేల్చారు. టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవే త్తలు ఈ ఘనత సాధిం చారు. 
 
→భూఫలకాల అంచులు లేదా పగుళ్లను ఫాల్ట్స్ పేర్కొంటారు. ఇవి నెమ్మదిగా కలి సిపోతే.. వాటి కదలికల వల్ల స్వల్పస్థాయి ప్రకంపనలు మాత్రమే వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
→వేగంగా పూడుకుపోయే ఫాల్ట్.. ఆ తర్వాత భారీ భూకంపం ద్వారా విడిపో తుందని వివరించారు. 
 
→తదుపరి భారీ ప్రకం పనలు ఎప్పుడు వస్తాయన్నది పసిగట్టడానికి ఈ అంశం ఒక్కటే సరిపోదన్నారు. 
 
→ఇందులో సంక్లిష్ట ప్రక్రియలు ఇమిడి ఉంటాయని పేర్కొన్నారు. అయితే భూకంపానికి ఉన్న అవకాశం, కారణాల గురించి శోధించడానికి ఇది సాయపడుతుందని తెలిపారు. 
 
→న్యూజి లాండ్ తీరానికి చేరువలోని ఒక ఫాల్ట్ ప్రాంతంలో శిలల పరిశీలన, కంప్యూటర్ నమూనాతో విశ్లేషణ ద్వారా శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధారించారు. 
 
→నేల నుంచి దాదాపు అర మైలు దూరం డ్రిల్ చేసి ఈ శిలలను సేకరించారు. తరచూ స్వల్పస్థాయి భూకం పాలు రావడానికి కారణం.. ఫాల్లో బంక మట్టి పుష్కలంగా కలిగిన శిలలు. 
 
→చాలా నెమ్మదిగా అతుక్కోవడమేనని వివరించారు.
 



International