image



ప్రమాదమెరుగని పిలాటస్ విమానం




→పైలెట్లకు ప్రాథమిక స్థాయిలో శిక్షణ అందించే పీసీ-7, ఎంకే-2 రకం పిలాటస్ విమానం.. ప్రమాదమెరుగని శిక్షణ విమా నంగా అరుదైన ఘనత సాధించింది. 
 
→వాయుసేనలో దశాబ్ద కాలంగా రెండు లక్షల గంటల ప్రమాద రహిత ప్రయాణంతో రికార్డు సృష్టించింది. 
 
→2013లో ఈ ఆధునిక యుద్ధ శిక్షణ విమానాలను భారతీయ వాయుసేన స్విట్జర్లాండ్ నుంచి కొనుగోలు చేసింది. 
 
→మొత్తం 75 శిక్షణ విమానాలను కొనుగోలు చేయగా, ఐదు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. 
 
→దుండిగల్ ఎయి ర్ఫోర్స్ అకాడమీ, చెన్నై తాంబరంలోని ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్ స్కూల్లో కలిపి 2 లక్షల గంటల ప్రమాద రహిత విమానయాన మైలురాయిని చేరుకున్నాయి. 
 
→ఈ నేపథ్యంలో ఎయిర్ మార్షల్ బి. చంద్రశేఖర్, చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ కెప్టెన్ అతుల్ ఆనంద్ ఇందులో ప్రయాణించి రెండు లక్షల గంటల (చివరి గంట) ప్రయాణాన్ని పూర్తిచేశారు. డిప్యూటీ కమాండెంట్ ఎయిర్ వైస్మర్షల్ డి.ఎస్. జోషి, చీఫ్ ఇన్స్ట్రక్టర్ (ఫ్లయింగ్), ఎయిర్ సీఎండీ ఈ అనిష్ అగర్వాల్, చీఫ్ ఇంజినీరింగ్ అధికారి డి. సంతుష్ట్ తదితరులు పాల్గొన్నారు. దుండిగల్ ఎయి ర్ఫోర్స్ అకాడమీ ఏటా పైలెట్లకు 25 వేల గంటల శిక్షణ ఇస్తోందని ఎయిర్ మార్షల్ బి. చంద్రశేఖర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 



Science