image



తొలిసారి ఉక్రెయిన్లో బైడెన్




→అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమ వారం ఆకస్మాత్తుగా ఉక్రెయిన్లో తొలిసారి పర్య టించారు. 
 
→ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలు పెట్టి ఏడాది కావస్తున్న నేపథ్యంలో సంఘీభావ సంకేత కంగా ఆ దేశ రాజధాని కీవు చేరుకు న్నారు.  
 
→ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ లెన్స్క బేటీ అయ్యారు. యుద్ధ నేపథ్యంలో తదుపరి చర్యలను అడిగి తెలుసుకు న్నారు.  
 
→మరిన్స్కై ప్యాలెస్లో ఆయనతో కలిసి బైడెన్ మాట్లాడుతూ రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధానిని త్వరగా ఆక్రమించుకుంటాయని ఏడాది క్రితం ఆందోళన చెందినట్లు గుర్తు చేసుకు న్నారు.  
 
→ఏడాదిగా సాగుతున్న పోరును 'కిరాతకం, 'అన్యాయమైన యుద్ధం' అని అభివర్ణించారు. "ఏడాది తరువాత చూస్తే కీవ్ ధైర్యంగా నిలబడింది. ఉక్రెయిన్ నిలబడింది.
ప్రజా స్వామ్యం నిలబడింది. అమెరికా మీతో కలిసి ఉంది. ప్రపంచమంతా మీతో ఉంది" అని బైడెన్ పేర్కొన్నారు.  
 
→హోవిట్జర్ షెల్స్, యాంటీ ట్యాంకు మిస్సైల్స్, ఎయిర్ సర్వైలెన్స్ రాడార్లు సహా 50 మిలియన్ డాలర్ల అదనపు సాయాన్ని ప్రకటించారు.  
 
→ఇప్పటి వరకూ ఉక్రె యిన్ కు అమెరికా 50 బిలియన్ డాలర్ల సాయాన్ని అందించింది.  
 
→దీర్ఘశ్రేణి ఆయు దాలు, తమకు అందిస్తామని చెప్పి ఇప్పటి వరకూ సరఫరా చేయని ఇతర ఆయుధాలు విషయాన్ని బైడెన్లో చర్చించినట్లు జెలెన్స్కీ వెల్లడించారు.  
 
→అయితే కొత్త హామీల గురించి ఏమీ వివరించలేదు. తమ చర్చలు పూర్తిస్థా యిలో ఫలవంతమయ్యాయని చెప్పారు. 
 
→కీలక యుద్ధ సమయంలో అమెరికా అధ్య క్షుడు ఉక్రెయిన్లో పర్యటించడం వెనుక ఆ దేశానికి మద్దతు ఇవ్వడంలో మిత్రపక్షాలను ఐక్యంగా ఉంచడం లక్ష్యంగా ఉంది.  
 
→త్వరలో రెండు వైపుల నుంచి యుద్ధం తీవ్రమవు తుందన్న అంచనాలు ఉన్నాయి.  
 
→తమకు వాగ్దానం చేసిన మేరకు ఆయుధాలను అందించాలని జెలెన్స్క మిత్రపక్షాలను కోరు తున్నారు. అంతేకాకుండా యుద్ధ విమానా లను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  
 
→దీనిని అమెరికా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.. 
 
→ఉక్రెయిన్ కు వేగంగా వేలాది ఫిరంగి గుళ్లను అందించేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) మార్గాలను అన్వేషించాలని ఈయూ దౌత్యాధికారులు సూచించారు.  
 
→లేదంటే రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి పాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 



International