image



మళ్లీ క్షిపణుల్ని పరీక్షించిన ఉత్తర కొరియా




→ ఉత్తర కొరియా   మరో రెండు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల్ని పరీక్షించింది.  
 
→ రాజధాని ప్యాంగ్యాంగ్కు ఉత్తరాన ఉన్న తీర పట్టణం నుంచి రెండు క్షిపణుల్ని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం గుర్తించింది.  
 
→ ఇవి రెండూ తమ ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్) వెలుపల పడ్డాయనీ, దానివల్ల ఆ ప్రాంతంలోని తమ విమానాలకు గానీ, యుద్ధ నౌకలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని జపాన్ ప్రకటిం చింది. ఈ పరీక్ష విషయాన్ని ఉత్తర కొరియా అధికా రిక వార్తాసంస్థ కూడా ధ్రువీకరించింది.
 
→గరిష్ఠంగా 100 కి. మీ. ఎత్తుకు వెళ్లి, 395 కి. మీ. దూరంలోని లక్ష్యాలపై ఇవి గురి పెట్టాయని తెలిపింది. దీనిలో 600 మి.మీ. బహుళ రాకెట్ లాంచర్ వ్యవస్థను వినియోగించారు. దక్షిణ కొరియాలోని ప్రాంతాలన్నీ ఈ క్షిపణి పరిధిలోనే ఉంటాయి. యుద్ధాల్లో వ్యూహాత్మక అణ్వాయుధాలు వాడేందుకు ఇవి ఉపయోగపడతాయి.
 
→ఇలా క్షిపణుల్ని పరీక్షించడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. దీనిపై జపాన్ మండిపడింది. వెంటనే భద్రత మండలి సమావేశాన్ని నిర్వహించాలని ఐరాసను కోరింది.  
 
→ఏడాది కాలంలో అత్యధిక స్థాయిలో 70కి పైగా క్షిపణుల్ని ఉత్తర కొరియా పరీక్షించింది. 
 
→అమెరికా- దక్షిణ కొరియా సైన్యాల సంయుక్త విన్యాసాలకు సమా ధానంగా అనూహ్య రీతిలో స్పందిస్తామని ఇప్పటికే ఈ దేశం హెచ్చరించిన విషయం తెలిసిందే. 
 
→ఈ విన్యా సాలు తమపై చొరబాటుకేనని ఉత్తర కొరియా అను మానిస్తోంది. అమెరికా దళాల చర్యలపై ఆధారపడి తమ స్పందన ఉంటుందని దేశాధినేత కిమ్ సోదరి యో జోంగ్ స్పష్టం చేశారు. 
 
→ఈ దేశం చేస్తున్న పరీక్షలు అంతర్జాతీయ శాంతికి విఘాతంగా మారనున్నాయని దక్షిణ కొరియా, జపాన్ పేర్కొంటున్నాయి. 
 
→ఉ. కొరియా అణ్వాయుధ కార్యక్రమానికి సహకరిస్తున్న నలుగురు వ్యక్తులు, ఐదు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ద. కొరియా ప్రకటించింది.
 



International