→ కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులను అత్యంత కచ్చితత్వంతో ముందుగానే పసిగట్టే దిశగా భారత శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు.
→ఇందుకోసం వారు కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్తో ఒక కొత్త అల్గోరిథము అభి వృద్ధి చేశారు.
→ హిమాచల్ ప్రదేశ్లోని మండీలో ఉన్న ఐఐటీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు.
→ కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్వత ప్రాంతాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతోంది. వీటిని తగ్గించాలంటే.. కొండచరి యలు విరిగిపడే ముప్పున్న ప్రాంతాలను గుర్తిం చాలి.
→ ఇందుకోసం కొండ వాలు, ఎత్తు, అక్కడి మట్టి రకం, నదులకు ఆ ప్రాంతం ఎంతదూరంలో ఉంది. వంటి వివరాలను సేకరించాలి.
→ గతంలో అక్కడ జరిగిన ఘటనలనూ తెలుసుకోవాలని పరిశోధనలో పాలుపంచుకున్న డి.పి. శుక్లా పేర్కొన్నారు. ఈ విష యంలో ఏఐ ఉపయోగపడుతుందని వివరించారు.
→ అనుభవాల ఆధారంగా కంప్యూటర్లు నిర్దిష్ట సామర్ధ్యాన్ని అలవర్చుకోవడం ఇందులో కీలకం.
→ ఈ ప్రక్రి యలో.. డేటాను విశ్లేషించి, నిర్దిష్ట పోకడలను గుర్తించి, అంచనాలను వెలువరించే అల్గోరిథమ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
→ ఈ విధానంలో కచ్చితత్వం కావాలంటే భారీస్థాయిలో శిక్షణ డేటా అవసరం. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం చాలా అరుదు.
→ దీనివల్ల అల్గోరిథమ్ శిక్షణకు అవసరమైన డేటా అందుబాటులో ఉండదు. సంబంధిత డేటాలోని సానుకూల, ప్రతికూల అంశాల మధ్య అసమతౌల్యత తలెత్తుతుంది.
→ ఇది అంచనాల కచ్చితత్వాన్ని దెబ్బతీ స్తుంది. దీన్ని అధిగమించడానికి శుక్లా బృందం కొత్తగా మెషీన్ లెర్నింగ్ అల్గోరిథమ్న అభివృద్ధి చేసింది.
National