image



నానోరేణువుల వీక్షణ సులువు




→  ప్రస్తుత మైక్రోస్కోపులు పసి గట్టలేని సూక్ష్మ నానో రేణువులను వీక్షించే సరికొత్త విధానాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)  శాస్త్రవేత్తలు కను గొన్నారు. 
 
→  ఇందు కోసం వారు న్యూరోమా ర్ఫిక్ కెమెరాతో కూడిన ఆప్టికల్ మైక్రోస్కోపీ, మెషీన్ లెర్నింగ్ అల్గోరిథ మ్లను ఉపయోగించారు. 
 
→  50 నానోమీటర్ల కన్నా చిన్నగా ఉన్న రేణువులను గుర్తించడా నికి ఇది సాయపడుతుంది.
 
→ఆప్టికల్ మైక్రోస్కోపులను కనుగొన్నప్పటి నుంచి శాస్త్రవేత్తలు 'వివర్తన పరిమితి' అనే అడ్డంకిని అధిగమించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. 
 
→ఈ పోకడ కారణంగా.. 200-300 నానోమీటర్ల కన్నా చిన్న పరిమాణంలో ఉన్న రెండు వస్తువుల మధ్య వైరుధ్యాలను ఆ సాధనాలు పసిగట్టలేవు. 
 
→దీన్ని న్యూరోమా ర్ఫిక్ కెమెరాతో ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు అధిగ మించారు. 100 గ్రాముల బరువుండే ఈ సాధనం.. మానవ కంట్లోని రెటీనా తర హాలో పనిచేస్తుంది. 
 
→కాంతి సంకేతాలను విద్యుత్ ప్రకంపనలుగా మారుస్తుంది. సంప్ర దాయ కెమెరాలతో పోలిస్తే దీనితో అనేక ప్రయోజనాలు ఉంటాయి.
 
→ దీనికి ప్ లెర్నింగ్ అల్గోరిథము జోడించడం ద్వారా వివర్తన పరిమితిని శాస్త్రవేత్తలు అధిగమిం చారు. సూక్ష్మమైన ఒక ఫ్లోరోసెంట్ బీడ్ను విజయవంతంగా వీక్షించగలిగారు.
 



Science