image



భారతీయ యువతకు 2,400 యూకే వీసాలు రెండేళ్లు అక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం




→అర్హులైన 18 నుంచి 30 ఏళ్ల వయసున్న భారతీయ యువతకు 'యూకే-ఇండియా యువ నిపు ణుల ఒప్పందం' కింద 2,400 వీసాలు జారీ చేయను న్నట్లు యూకే ప్రభుత్వం   ప్రకటించింది. 
 
→దీనికి సంబంధించిన నియమ నిబంధనలను ఓ ప్రక టనలో పేర్కొంది. ఆ వివరాల ప్రకారం.. అభ్యర్థి వీసా పొందాలంటే ముందుగా బాలెట్ దశలో ఎంపిక వ్వాలి. 
 
→ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు బాలెట్ నమోదుకు అవకాశం ఉంటుంది. దీనిని ఉచితంగానే చేసుకోవచ్చు. 
 
→ఈ ప్రక్రియ మొదలు పెట్టాలంటే ఈ | వీసా పొందడానికి పూర్తి అర్హత ఉందని అభ్యర్థి తప్ప నిసరిగా ప్రకటించాలి. 
 
→బాలెట్ దశలో ఎంపికయిన అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. మంజూరైన తర్వాత ఆరు నెలల్లోగా యూకేకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. 
 
→ఈ దఫా వీసా పొందలేకపోతే జులైలో ప్రారంభమయ్యే రెండో బాలెట్ ద్వారా మరోసారి ప్రయత్నించొచ్చు. 
 
→భారత్, యూకే ప్రభుత్వాల మధ్య ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం యూకే యువత రెండేళ్ల పాటు భారత్లో ఉండొచ్చు. 
 
→అదే విధంగా భారతీయులకూ యూకేలో నివసించే అవకాశం ఉంటుంది.
 



International