imageప్రొఫెసర్‌ చెన్నుపాటి జగదీశ్‌కు ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారం
→ప్రొఫెసర్‌ చెన్నుపాటి జగదీశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారాన్ని ప్రకటించింది. 
 
→విదేశాల్లో విభిన్న రంగాల్లో అత్యుత్తుమ ప్రతిభ కనబర్చిన ప్రవాస భారతీయులకు ఇచ్చే ఈ అత్యున్నతమైన ఈ పురస్కారాలను 2023 సంవత్సరానికి గానూ 27 మందికి కేంద్రం ప్రకటించింది. 
 
→అందులో కృష్ణా జిల్లా వల్లూరుపాలేనికి చెందిన ప్రొఫెసర్‌ చెన్నుపాటి జగదీశ్‌ ఒకరు. 
 
→ఆస్ట్రేలియాలో అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ అధ్యక్షునిగా ఉన్న జగదీశ్‌కు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/విద్యా విభాగంలో ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.
 
→ జనవరి 8 నుంచి మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌ ప్రవాసీ భారతీయ సదస్సును నిర్వహించనున్నారు. 
 
→ఆ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు.
 Awards