imageప్రముఖ పాకశాస్త్ర నిపుణురాలు రీనాకు ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారం
→ప్రవాస భారతీయురాలు, ప్రముఖ పాకశాస్త్ర నిపుణురాలు రీనా వినోద్‌ పుష్కర్ణను భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారానికి ఎంపిక చేసింది. 
 
→ప్రవాసీయులకు ఇచ్చే ఈ అత్యున్నత అవార్డుకు ఈ ఏడాది 21 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. 
 
→జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. 
 
→ఆర్మీ కుటుంబంలో జన్మించిన రీనా తన భర్త వినోద్‌తో కలిసి 1983లోనే ఇజ్రాయెల్‌కు వచ్చేశారు. 
 
→అప్పట్లోనే ‘తందూరి’ అనే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసి, ఇక్కడి వారికి భారతీయ రుచులను పరిచయం చేశారు. 
 
→2017లో మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనకు వచ్చినపుడు ఆయనకు ఆహారాన్ని తయారు చేసే ఉన్నత స్థాయి బృందంలో ఒకరిగా రీనాను ఎంపిక చేశారు. 
 
→1993లో నార్వే మధ్యవర్తిత్వంతో జరిగిన ఇజ్రాయెల్‌ - పాలస్తీనా శాంతి చర్చలూ ‘తందూరి’లోనే జరగడం విశేషం. 
 Awards