image



ఆస్కార్ నామినేషన్ల బరిలో 10 భారతీయ చిత్రాలు




→ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. విజే తలెవరో ఇంకొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. 
 
→నిర్వాహకుల కమిటీ ది అకా డెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెన్ నామినేషన్ బరిలో నిలిచే చిత్రాల వివరాల్ని   ప్రకటించింది. 
 
→ఇందులో ఆఖరి మెట్టుపై 10 భారతీయ చిత్రాలు ఉండటం ఈ ఏడాది ప్రత్యేకత. 'ఆర్ఆర్ఆర్', 'గంగూభాయ్ కారియావాడి', 'ది కశ్మీర్ ఫైల్స్', 'కాంతార'లు షార్ట్ లిస్ట్ లో ఉన్నట్టు కమిటీ ప్రకటించింది. 
 
→భారతీయ అధికారిక ఎంట్రీ చిత్రం చెల్లో షో'తోపాటు 'మీ వసం తెవు', 'తుజ్య సాథీ కహీ హై, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్, 'విక్రాంత్ రోణ' 'ఇరవిన్ నిహల్' సైతం బరిలో ఉన్నాయి. 
 
→ఈ బరిలో మొత్తం 301 చిత్రాలు పోటీపడుతున్నాయి. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్, 'బ్లాక్ పాంథర్: వాకాండ ఫరెవర్', 'టాప్ గన్: మావెరిక్ లాంటి చిత్రాలు ప్రధాన విభాగంలో ఉన్నాయి. 
 
→జనవరి 12న ఓటింగ్ చేయడం మొదలు పెడతారు.
 



Awards