image



ఆర్‌ఆర్‌ఆర్‌లో పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం




→ప్రపంచ సినిమా వేదికపై తెలుగు చిత్రసీమ జెండా రెపరెపలాడింది. ‘బాహుబలి’ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి నుంచి వచ్చిన మరో బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం గెలుచుకుంది. 
 
→ఇప్పుడు ఆ పాటే ‘ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ (మోషన్‌ పిక్చర్‌)’ విభాగంలో అవార్డు అందుకుంది. 
 
→కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ‘నాటు నాటు’ పాటను స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌ కీరవాణి పురస్కారాన్ని అందుకున్నారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చగా, రాహుల్‌ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. 
 
→ఆసియా ఖండంలో ఈ పురస్కారాన్ని దక్కించుకున్న తొలి పాట ఇదే. టేలర్‌ స్విఫ్ట్, రిహానా, లేడీ గాగా లాంటి ప్రముఖ గాయకుల పాటలతో పోటీని ఎదుర్కొంటూ విశ్వ వేదికపై నాటు నాటు పాట విజయకేతనం ఎగురవేసింది.
 



Awards