imageఏన్కూరు ‘ఆగ్రోస్‌’కు జాతీయ పురస్కారం
→ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం నిర్వహిస్తున్న ఎ.సాయిరాం జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. 
 
→దిల్లీలో జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ (మేనేజ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి శోభాఠాకూర్‌ ఈ
పురస్కారం ప్రదానం చేసినట్లు రాజేంద్రనగర్‌లోని మేనేజ్‌ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర తెలిపారు. 
 
→రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు ఈ పురస్కారం లభించిందని ఆగ్రోస్‌ ఎండీ రాములు తెలిపారు.
 Awards