imageప్రసన్న కుమార్‌కు రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం
→కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ చేతుల మీదుగా రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాన్ని జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కమాండెంట్‌ వి.వి.ఎన్‌.ప్రసన్న కుమార్‌ అందుకున్నారు. 
 
→ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రైజింగ్‌ డేను పురస్కరించుకుని దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 
 
→కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో అత్యున్నత సేవలందించిన పలువురికి గతేడాది గణతంత్ర దినం సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలను ప్రకటించిన విషయం విదితమే. 
 
→బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్‌ 1997లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాలో సీఆర్‌పీఎఫ్‌లో చేరారు. 
 
→అనంతరం మణిపూర్, అస్సాం, జమ్మూ కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ హోదాల్లో పని చేశారు. 
 
→గతేడాది గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ తరఫున సహాయక కార్యక్రమాలకు ఆయన నేతృత్వం వహించారు.
 Awards