image



జాతీయ బాల పురస్కారాల ప్రదానం




→వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 11 మంది చిన్నారులకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్‌ - 2023లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. 
 
→దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళలు, సాంస్కృతిక విభాగంలో నలుగురికి, క్రీడా విభాగంలో ముగ్గురికి, నూతన ఆవిష్కరణల్లో ఇద్దరికి, శౌర్య, సామాజిక సేవ విభాగాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మందికి పురస్కారాలను అందజేశారు. 
 
→పురస్కారాలు స్వీకరించిన 11 మందిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. 
 
→తెలంగాణకు చెందిన నాట్య కళాకారిణి ఎం.గౌరవి రెడ్డి (17) పురస్కారం స్వీకరించారు. 
 
→అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి పతకం, రూ.లక్ష నగదు, ధ్రువపత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. 
 
→పుట్టినప్పటి నుంచి ఎముకల జబ్బుతో బాధపడుతున్న కేరళ బాలుడు ఆదిత్య సురేశ్‌ (16) ఉత్తమ గాయకుడిగా పేరు సాధించి ప్రస్తుతం పురస్కారం అందుకున్నాడు. 
 
→వివిధ టీవీ ఛానెళ్లతో పాటు 500కుపైగా వేదికలపై బాలుడు గళం వినిపించాడు.
 



Awards