image



‘నాటు నాటు’కు ఆస్కార్‌ నామినేషన్‌




 
→సినీ ప్రపంచం అత్యున్నత పురస్కారంగా పరిగణించే ఆస్కార్‌ కల సాకారం దిశగా తెలుగు సినిమా మరో అడుగేసింది. 
 
→ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట 95వ ఆస్కార్‌ నామినేషన్‌కు ఎంపికై చరిత్ర సృష్టించింది. 
 
→ఇప్పటికే విశ్వ వేదికపై ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ సహా పలు పురస్కారాల్ని గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించిన ఈ పాట, తాజాగా ఆస్కార్‌ నామినేషన్లలో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ అయ్యింది. 
 
→మరొక్క అడుగు ముందుకు పడిందంటే ఆస్కార్‌ సొంతమైనట్టే. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’, ఉత్తమ డాక్యుమెంటరీ
షార్ట్‌ విభాగంలో.. భారతీయ డాక్యుమెంటరీ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్ఫరర్స్‌’ సైతం నామినేషన్లు దక్కించుకున్నాయి.
 



Awards