image



901 మంది పోలీసులకు సేవా పతకాలు




→విధి నిర్వహణలో శౌర్యసాహసాలు, అత్యుత్తమ పనితీరును ప్రదర్శించినందుకుగానూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌), వివిధ రాష్ట్రాలకు చెందిన 901 మంది పోలీసు సిబ్బందికి కేంద్ర హోం శాఖ వివిధ సేవా పతకాలను ప్రకటించింది. 
 
→74వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని పురస్కారాల జాబితాను విడుదల చేసింది. 
 
→వీరిలో 140 మందికి శౌర్య పతకాలు (పీఎంజీ), 93 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (పీపీఎండీఎస్‌), 668 మందికి ప్రతిభా పురస్కారాలు (పీఎంఎంఎస్‌) దక్కాయి. 
 
→ఈసారి అత్యున్నత రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకాన్ని (పీపీఎంజీ)పోలీసు దళాల్లో ఎవరికీ ప్రకటించలేదు. 
 
→సీఆర్‌పీఎఫ్‌ అధికారి ప్రకాశ్‌ రంజన్‌ మిశ్రా 8వ సారి శౌర్య పురస్కారం సొంతం చేసుకున్నారు. 
 
→సెకండ్‌-ఇన్‌-కమాండ్‌ హోదాలో ఉన్న ఆయన కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఎక్కువ సార్లు శౌర్య పతకాలు సాధించిన వ్యక్తిగా నిలిచారు. 
 
→2020 డిసెంబరు 20న ఝార్ఖండ్‌ ఖూంటీ జిల్లాలో జరిపిన ఆపరేషన్‌లో 152 కేసులున్న మావోయిస్టు రీజనల్‌ కమాండర్‌ను మట్టుబెట్టడంతో మిశ్ర కీలక పాత్ర పోషించారు.
 
→పోలీసు పతకాలను సొంతం చేసుకున్న వారిలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు చెందిన 30 మంది అధికారులు కూడా ఉన్నారు. 
 
→ఆరుగురికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 24 మందికి ప్రతిభా పురస్కారాలు దక్కాయి.  
 



Awards