imageపద్మ పురస్కారాలు
→కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 12 పద్మ అవార్డులు వరించాయి. 
 
→దేశవ్యాప్తంగా మొత్తం 91 పద్మశ్రీలు ప్రకటించగా ఇందులో తెలుగువారి వాటా పది కావడం విశేషం. 
 
→అలాగే ఆధ్యాత్మిక రంగం నుంచి చినజీయర్‌ స్వామి, కమలేష్‌ డి.పటేల్‌లను పద్మభూషణ్‌ పురస్కారాలు వరించడం ముదావహం. 
 
→గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 106 ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. 
 
→విభిన్న రంగాల్లో సేవలందించిన ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీలు దక్కాయి.
 
→ దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’కు ఈ జాబితాలో ఎవరినీ ఎంపిక చేయలేదు. 
 Awards