image



ప్రధానమంత్రి రిషి సునాక్‌ పాయింట్స్‌ ఆఫ్‌ లైట్‌ అవార్డు




→విద్యుత్తు లేకుండా, తక్కువ నీటితో వాషింగ్‌ మెషిన్‌ తయారు చేసిన భారత సంతతి వ్యక్తి నవ్‌జోత్‌ సాహనీకి రిషి సునాక్‌ అవార్డును బ్రిటన్‌ ప్రకటించింది. 
 
→బ్రిటన్‌లో జన్మించిన నవ్‌జోత్‌ సాహనీ మహిళలు దుస్తులు ఉతకడం చూడలేకపోయారు. 
 
→వారి కష్టాన్ని కొంతలో కొంతైనా తగ్గించాలని భావించారు. అంతేకాకుండా పేదలకు ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నారు. 
 
→దీంతో విద్యుత్‌ లేకుండానే పనిచేసేలా పరికరాన్ని తయారు చేశారు. నీరు సైతం 50 శాతం ఆదా అయ్యేలా రూపొందించారు.
 
→ చేతితో ఉతికే సమయానికంటే ముందే పని ముగించేలా వాషింగ్‌ మెషిన్‌ను తీర్చిదిద్దారు.
 
→ దానికి తన స్నేహితురాలు పేరు మీద ‘దివ్య పరికరాలు’ అని పేరు పెట్టి 300 వాషింగ్‌ మెషిన్‌లను ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలకు, పునరావాస కేంద్రాలకు, ఆనాథాశ్రమాలకు ఇచ్చారు. నాలుగేళ్ల క్రితమే ఆయన ఈ పరికరాన్ని రూపొందించారు. 
 
→ భారత్‌లో నిర్వహించిన ఈ ప్రాజెక్టును బ్రిటన్‌ ప్రభుత్వం గుర్తించింది. ‘ప్రధానమంత్రి రిషి సునాక్‌ పాయింట్స్‌ ఆఫ్‌ లైట్‌’ అవార్డును సాహనీకి ప్రకటించింది.
 



Awards