image



గణతంత్ర దినోత్సవ విజేత ఉత్తరాఖండ్‌ శకటం




→గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ రాష్ట్రంలోని ప్రకృతి సౌందర్యాన్ని, అపూర్వమైన ఆధ్యాత్మికతను కళ్లకు కట్టిన ఉత్తరాఖండ్‌ శకటానికి రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానం దక్కింది. 
 
→కవాతు చేసిన శకటాల్లో వివిధ విభాగాల్లో తొలి మూడు స్థానాలకు ఎంపికైన వాటిని కేంద్రం ప్రకటించింది. 
 
→ప్రభుత్వ శాఖల్లో గిరిజన వ్యవహారాల శాఖ శకటం ఉత్తమ స్థానం సాధించింది. 
 
→త్రివిధ దళాల సైనికులు చేసిన కవాతుల్లో పంజాబ్‌ రెజిమెంట్‌ మొదటి స్థానంలో నిలిచింది.
 
→ అలాగే కేంద్ర సాయుధ పోలీసు దళాలకు సంబంధించి సీఆర్పీఎఫ్‌ మొదటి బహుమతి గెలుచుకుంది. 
 
→ మై గవ్‌ వెబ్‌సైట్‌లో నమోదైన ఓటింగ్‌లో గుజరాత్‌ శకటం, వాయుసేన కవాతు, హోం శాఖ శకటాలకు ఆయా విభాగాల్లో తొలి స్థానాలు దక్కాయి.
 



Awards