imageమన్మోహన్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం
→భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ (90)కు బ్రిటన్‌లో జీవితకాల సాఫల్య గౌరవాన్ని ప్రకటించారు. 
 
→ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా భారత్‌ - బ్రిటన్‌ విజేతల సంఘం ఈ అవార్డును ప్రకటించింది. 
 
→బ్రిటన్‌లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం (ఎన్‌ఐఎస్‌ఏయూ) త్వరలోనే దిల్లీలో మన్మోహన్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. 
 
→బ్రిటిష్‌ విశ్వవిద్యాలయాలలో చదివి లబ్ధప్రతిష్ఠులైన భారతీయ విద్యార్థులకు ఇచ్చే అవార్డు ఇది. 
 
→భారతదేశ భవితకు సారథులైన యువత నుంచి ఈ గౌరవం పొందడం తనను ఎంతో కదిలిస్తోందని మన్మోహన్‌ లిఖిత సందేశంలో పేర్కొన్నారు. 
 Awards