image



న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌




→న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకాలం ప్రధానిగా ఉన్న జెసిండా ఆర్డెన్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
→దీంతో అధికార లేబర్‌ పార్టీ ప్రతినిధులు సమావేశమై పార్టీ కొత్త నాయకుడిగా, దేశానికి 41వ ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌ను ఎన్నుకున్నారు. 
 
→జనవరి 25న ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తానని క్రిస్‌ తెలిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అధిక ద్రవ్యోల్బణం, గృహాల అధిక ధరలు వంటి సమస్యలతో పాటు శాంతిభద్రతలపై దృష్టి సారిస్తానని ఆయన పేర్కొన్నారు. 
 
→కాగా, ఈ ఏడాది అక్టోబరు 14న న్యూజిలాండ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
 



International