image



చైనా విదేశాంగ మంత్రిగా చిన్‌ గాంగ్‌




→చైనా నూతన విదేశాంగ మంత్రిగా చిన్‌ గాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఆయన అమెరికాలో బీజింగ్‌ రాయబారిగా ఉన్నారు. 
 
→మాజీ విదేశాంగ మంత్రి వాంగ్‌ యి స్థానంలో చిన్‌ గాంగ్‌ నియమితులయ్యారు. మరోవైపు తమ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ను కూడా చైనా బదిలీ చేసింది. 
 
→ఆయనను సరిహద్దులు, సముద్ర వ్యవహారాల విభాగానికి పంపించింది. ఈ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడలేదు. 
 
→అయితే, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అధికార ప్రతినిధుల జాబితా నుంచి ఝావో లిజియన్‌ను తొలగించి, సరిహద్దులు, సముద్ర వ్యవహారాల విభాగ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా పేర్కొన్నారు.
 



International