image



అమెరికా కొత్త స్పీకర్‌ మెకార్థీ




→అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) దిగువ సభ (ప్రజాప్రతినిధుల సభ) స్పీకర్‌గా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కెవిన్‌ మెకార్థీ ఎట్టకేలకు ఎన్నికయ్యారు. 
 
→కొన్ని రోజులుగా ఓటింగ్‌ మీద ఓటింగ్‌ జరుగుతూ వచ్చింది. చివరకు 15వ దఫా ఓటింగులో ఆయన నెగ్గగలిగారు. 
 
→అంతకుముందు పలుసార్లు అవమానకర రీతిలో మెకార్థీ ఓడిపోయినా, గెలవడానికి కావల్సిన మెజారిటీని డెమోక్రటిక్‌ పార్టీ ప్రత్యర్థి హకీం సెకూ జెఫ్రీస్‌ సాధించలేకపోయారు. 
 
→ప్రస్తుతం సభలో రిపబ్లికన్లకే స్వల్ప మెజారిటీ ఉండటం దీనికి కారణం. చివరకు 15వ దఫా ఓటింగులో మెకార్థీ 216-212 ఓట్ల తేడాతో జెఫ్రీస్‌ను ఓడించి స్పీకర్‌ పీఠాన్ని అధిరోహించారు. 
 
→ఎన్నికల తర్వాత 435 మంది సభ్యులున్న సభలో రిపబ్లికన్లకు 222 సీట్లు, డెమోక్రాట్లకు 212 సీట్లు లభించాయి. 
 
→స్పీకర్‌ ఎన్నిక కోసం అమెరికా చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఓటింగ్‌ 1855లో సంభవించింది. అప్పట్లో రెండు నెలల పాటు 133 సార్లు ఓటింగ్‌ జరిగింది.
 



International