imageవిశ్వాస పరీక్షలో నెగ్గిన నేపాల్‌ ప్రధాని ప్రచండ
→నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ పార్లమెంటు విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. 
 
→ఓటింగ్‌లో ప్రతినిధుల సభలో పాల్గొన్న 270 మందికిగానూ అనూహ్యంగా 268 మంది ప్రచండకు మద్దతు ప్రకటించారు. నేపాల్‌ చరిత్రలో ఏ ప్రధానికైనా ఇదే అత్యధికం. 
 
→275 మంది సభ్యులు ఉన్న నేపాల్‌ పార్లమెంటులో ప్రధానిగా ఉండాలంటే 138 మంది మద్దతు సరిపోతుంది. నలుగురు సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. 
 
→ఒక్కొక్క సభ్యుడిని కలిగిఉన్న పీపుల్స్‌ ఫ్రంట్‌ నేపాల్, నేపాల్‌ వర్కర్స్‌ అండ్‌ పీసంట్స్‌ పార్టీలు తప్ప మిగిలిన పార్టీలన్నీ ప్రచండను బలపరిచాయి. 
 
→ఎన్నికల్లో 89 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపాలీ కాంగ్రెస్‌ సైతం ప్రచండకు మద్దతు ఇవ్వడం విశేషం.
 International