image



న్యూజిలాండ్ ప్రధాని జెసిండా రాజీనామా




→కొవిడ్ కట్టడి, క్రైస్ట్ చర్చ్ కాల్పుల తదనంతర పరి ణామాల్లో తనదైన ముద్ర వేశారని ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందిన న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
→తన పదవికి న్యాయం చేయలేక రాజీనామా చేస్తున్నట్లు   ప్రకటించారు. ప్రధానిగా ఫిబ్రవరి 7 తనకు చివరి రోజని.. ఉబికివస్తున్న కన్నీళ్లతో ప్రకటించారు. 
 
→సాధారణ ఎన్నికల వరకు ఎంపీగా కొనసాగుతానని స్పష్టంచేశారు. అప్పటివరకు ప్రధానిగా ఎవరుంటారనేది   తేలనుంది.
 



International