image



తొలిసారి తగ్గిన చైనా జనాభా




→జననాల రేటు తగ్గుతుండటం, వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తమ జనాభా ఇటీవలి కాలంలో తొలిసారిగా తగ్గినట్లు చైనా ప్రకటించింది. 
 
→2021 కంటే 2022 చివరి నాటికి తమ దేశ జనాభా 8.50 లక్షలు తగ్గిందని అక్కడి నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) తెలిపింది. 
 
→95.6 లక్షల జననాలు, 1.04 కోట్ల మరణాలు ఉండటంతో చైనా మొత్తం జనాభా 141.18 కోట్లుగా ఖరారు చేశారు. 
 
→ఇందులో పురుషులు 72.2 కోట్లు ఉండగా, మహిళలు 68.97 కోట్ల మంది ఉన్నారు. ఈ లెక్క చైనా ప్రధాన భూభాగానికే పరిమితం. 
 
→హాంకాంగ్, మకావ్‌ భూభాగాలతో పాటు స్థానికంగా ఉంటున్న విదేశీయులను పరిగణనలోకి తీసుకోలేదు. 
 
→ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని, 2023 ఏప్రిల్‌ నాటికి అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్‌ నిలుస్తుందని గతేడాది నవంబరు 15న ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 
 
→1950 తర్వాత తొలిసారిగా 2020లోనే ప్రపంచ జనాభా 1% తగ్గిందని తెలిపింది. ఈ లెక్కన 2050 నాటికి భారత జనాభా 166.80 కోట్లకు చేరుకుంటుందని, అప్పటికి చైనా జనాభా 131.70 కోట్లే ఉంటుందని ఐరాస అంచనా వేసింది. 
 
→‘ఒక్క సంతానం’ విధానానికి చైనా 2016లోనే ముగింపు పలికింది. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండొచ్చని చెప్పినా, దానికి పెద్దగా స్పందన రాలేదు. 
 
→చైనా నగరాల్లో పిల్లల పెంపకానికి ఖర్చు ఎక్కువగా ఉండటం కూడా జననాల రేటు తగ్గడానికి కారణమని చెబుతున్నారు.
 
→ప్రస్తుతం చైనా జనాభాలో 62% అంటే.. 87.55 కోట్ల మంది 16-59 ఏళ్ల మధ్య వయసువారు ఉన్నారు. 65 ఏళ్లు దాటిన వారు 20.97 కోట్లు అంటే 14.9% ఉన్నారని చైనా నేషనల్‌ బ్యూరో తెలిపింది. 
 



International