image



మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస




→లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్‌ రెహమాన్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిర్ణయం తీసుకుంది. 
 
→భద్రతా మండలికి చెందిన ఐఎస్‌ఐఎల్, ఆల్‌ఖైదా ఆంక్షల కమిటీ మక్కీని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. భారత్, అమెరికా ఈ మేరకు ప్రతిపాదన చేయగా ఏడు నెలల క్రితం చైనా అడ్డుపడింది. 
 
→తాజాగా డ్రాగన్‌ తన అభిప్రాయాన్ని మార్చుకోవడంతో ఈ నిర్ణయం వెలువడింది. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంతో అతడికి సంబంధించిన ఆస్తుల స్వాధీనం, ప్రయాణాలు, ఆయుధాల కొనుగోళ్లపై నిషేధం మొదలైనవి అమలులోకి వస్తాయి. 
 
→మక్కీ లాహోర్‌లో గృహ నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐరాస నిషేధిత జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన లేదా పాకిస్థాన్‌తో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదుల సంఖ్య సుమారు 150కి చేరింది.
 



International