image



భారత్‌తో కలిసి క్వాడ్‌ను బలోపేతం చేస్తాం




→భారత్, ఆస్ట్రేలియాతో కలిసి ఇండో - పసిఫిక్‌ ప్రాంతానికి ప్రయోజనం కలిగించే ఓ బలమైన శక్తిగా కొనసాగేలా క్వాడ్‌ను బలోపేతం చేస్తామని అమెరికా, జపాన్‌ పేర్కొన్నాయి.
 
→ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్‌ ప్రధాని కిషిద శ్వేతసౌధంలో సమావేశమయ్యారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదలైంది. 
 
→ విడదీయరాని ద్వైపాక్షిక సంబంధాలే మా ఇరు దేశాలకు పునాది. దీన్ని ఆధారంగా ఇండో - పసిఫిక్, ప్రపంచ ప్రయోజనాల కోసం మేం ఈ ప్రాంతంలో, వెలుపల కూడా ఇతరులతో సహకరిస్తాం. 
 
→ ఆస్ట్రేలియా, భారత్‌తో కలిసి క్వాడ్‌ ఒక శక్తిగా కొనసాగేలా చూస్తామని అందులో పేర్కొన్నారు. క్వాడ్‌లో అమెరికా, జపాన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియాలు సభ్య దేశాలు. 
 
→ ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేస్తూ స్వేచ్ఛాయుత సముద్ర వాణిజ్యం కొనసాగేలా చేయడమే లక్ష్యంగా క్వాడ్‌ ఏర్పడింది.
 



International