image



బ్రిటన్‌ నుంచి ‘వర్జిన్‌ ఆర్బిట్‌’ ప్రయోగం విఫలం




→బ్రిటన్‌ భూభాగం నుంచి ఉపగ్రహాల ప్రయోగానికి జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైంది. అమెరికాకు చెందిన వర్జిన్‌ ఆర్బిట్‌ సంస్థ కార్న్‌వాల్‌ నగరం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 
 
→ఇందుకోసం మార్పిడి చేసిన ఒక బోయింగ్‌ 747 విమానాన్ని ఉపయోగించింది. దీనికి 9 చిన్నపాటి ఉపగ్రహాలతో కూడిన ఒక రాకెట్‌ను అమర్చింది. 
 
→గగనతలంలోకి వెళ్లాక 10 వేల మీటర్ల ఎత్తులో ఈ విమానం ఆ రాకెట్‌ను విడుదల చేసింది. అయితే సాంకేతిక లోపం కారణంగా అది భూ కక్ష్యలోకి చేరుకోలేకపోయిందని వర్జిన్‌ ఆర్బిట్‌ పేర్కొంది. 
 
→దీంతో రాకెట్, అందులోని ఉపగ్రహాలు ధ్వంసమయ్యాయి. విమానం సురక్షితంగా కార్న్‌వాల్‌కు తిరిగొచ్చింది.
 



International