image



బ్రిటన్లో యువ నిపుణులు పథకం




→ రెండేళ్లు ఉండొచ్చు.. పని చేసుకోవచ్చు 
 
→ వచ్చేనెల 28 నుంచి కొత్త పథకం
 
→ భారతీయ వృత్తి నిపుణులు గరిష్టంగా రెండేళ్లపాటు బ్రిటన్లో నివాసం ఉంటూ అక్కడే పని చేసేందుకు వీలు కల్పించే కొత్త పథకం వచ్చేనెల 28న ప్రారంభం కానుంది
 
→  బ్రిటన్ వృత్తి నిపుణులు మన దేశంలో ఉండేందుకు, పని చేసేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న నిపుణులు దీనికి అర్హులు. 
 
→ దీనిని 'యువ నిపుణులు పథకం' గా పిలుస్తారు. రెండు దేశాల విదేశీ వ్యవహారాల కార్యాలయాల మధ్య సంప్రదింపుల తర్వాత ఈ మేరకు ప్రకటన వెలువడింది.
 



International