image



సఖాలిన్‌- । క్షేత్రాల్లో ఓవీఎల్‌కు 20 శాతం వాటాలు




 
→రష్యాలోని సఖాలిన్‌-1 చమురు, గ్యాస్‌ క్షేత్రాల్లో   తిరిగి 20 శాతం వాటాలను తీసుకున్నట్లు ప్రభుత్వ  రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ విదేశ్‌ (ఓవీఎల్‌)  వెల్లడించింది.  
 
→ఈ ప్రాజెక్టు ఆపరేటర్‌ అయిన అమెరికన్‌ సంస్థ ఏక్సాన్‌ మొబిల్‌ అనుబంధ కంపెనీ ఎక్సాన్‌  నెఫ్ట్‌గాజ్‌ను పక్కకు తప్పించి, దానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌  గతేడాది కొత్త ఆపరేటర్‌కు బదలాయించారు.  
 
→గతంలో తమకున్న వాటాలను తిరిగి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ అప్పట్లో షేర్‌హోల్డర్లయిన జపాన్‌ సంస్థ సోడెకో కన్ఫార్షియం,  ఓవీఎల్‌కు రష్యా ప్రభుత్వం సూచించింది. దీనికి అనుగుణంగానే ఓవీఎల్‌ దరఖాస్తు చేసుకోగా, గతంలో ఉన్న వాటాలను తిరిగి కేటాయించింది.  
 



International