image



ఉక్రెయిన్ పై ఐరాస సర్వప్రతినిధి సభ తీర్మానం




→ఉక్రెయిన్ యుద్ధాన్ని తక్షణమే ముగించాల్సిందిగా రష్యాను డిమాండ్ చేస్తూ  ఐరాస సర్వప్రతినిధి సభ ప్రత్యేక తీర్మానం  ఆమోదించింది.
 
→ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఐరాస సర్వప్రతినిధి సభ ప్రత్యేకంగా సమావేశమైంది. 
 
→శాంతి స్థాపనకు సంబంధించి ఉక్రెయిన్, దాని మద్దతుదారు దేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి.
 
→తీర్మానానికి అనుకూలంగా 141 ఓట్లు రాగా వ్యతిరేకంగా 7 ఓట్లు వచ్చాయి.
 
→భారత్, చైనా సహా మొత్తం 32 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.
 
→ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా - కాంబోజ్.
 



International