image



'రెసినా డైలాగ్' కు ఇరాన్ దూరం




→భారత్ లో 2023, మార్చిలో జరిగే 'రైజినా డైలాగ్ సద స్సుకు హాజరుకావడం లేదని ఇరాన్ ప్రకటించింది.
 
→ఈ సదస్సుకు హాజరు కావాల్సిన ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.
 
→భారత విదేశాంగ శాఖ, ఆబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించనున్న రైజినా డైలాగ్ పై ప్రచార వీడియోలో ఇరాన్లో హిజాబ్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఒక మహిళ జుట్టు కత్తిరించుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. 
 
→ఇరాన్ అధ్య క్షుడు ఇబ్రహీం రైసీ ఫొటో పక్కనే, మహిళ జుట్టు కత్తి రించుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో ఉండటంపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
 
→అధ్యక్షుడితోపాటు నిరసనకారుల్ని చూపించడాన్ని అక్ష్మీ పించిన భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రచార వీడియోలో ఆ భాగాన్ని తొలగించాలని కేంద్ర
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 
 
→అయితే ప్రభుత్వం దాన్ని తొలగించకపోవడంతో మనస్తాపానికి గురైన ఇరాన్ ఈ సదస్సుకి హాజరు కావడం లేదని తేల్చి చెప్పింది.
 
→అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన చర్చ జరపడానికి 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం రైజినా డైలాగ్స్న నిర్వహిస్తోంది.
 



International