image



తుర్కియే సిరియా సరిహద్దుల్లో భారీ భూకంపం




→ తుర్కియే, సిరియా సరిహద్దుల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వేలాది మందిని బలిగొంది.
 
→ భూకంప కేంద్రం ఆగ్నేయ తుర్కియేలోని కహ్రమా స్మరాస్ ప్రావిన్స్ లో గజియాన్తెప్కు 35 కి.మీ. దూరంలో, భూమికి 18 కి.మీ. దిగువన ఉన్నట్లు గుర్తించారు.
 
→  భౌగోళికంగా 'అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్' ప్రాంతంలో ఉన్న తుర్కియేలో భూప్రకంపనలు సర్వసాధారణంగా మారాయి.
 
→  2020లో 33 వేల భూకంపాలు నమోద య్యాయి. వీటిలో 332 భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై దాదాపు 4.0 గా రికార్డు అయ్యింది.
 
→ యురేసియన్, ఆఫ్రికన్ ప్లేట్ల చీలిక భాగంలో తుర్కియే | బోయింగ్ 747 విమానం తయారీని బోయింగ్ భూభాగం ఉంది. 
 
→ యురేసియన్, అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్ల నడుమ నార్త్ అనటోలియన్ పాల్ట్ (ఎన్ఎస్) లైన్ అనే చీలిక ఉంది. 
 
→ రెండు ప్లేట్లు ఢీకొనడంతో ఇక్కడే భూకంపం ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. 
 
→ ఎన్ ఏఎఫ్ చీలిక దక్షిణ ఇస్తాంబుల్ నుంచి ఈశాన్య తుర్కియే దాకా విస్తరించినట్లు గుర్తించారు. 
 
→ 1999, 2011లోనూ ఈ ప్రాంతం నుంచే భూకంపాలు విస్తరిం చినట్లు పరిశోధకులు వెల్లడించారు. 
 
→ 1999 నాటి భూకంపంలో 18 వేల మంది, 2011 నాటి భూకం రంపంలో 500 మందికి పైగా మరణించారు.
 
→ తుర్కియేలో ఏకంగా 95 శాతం భూభాగం భూకంప ప్రభావిత ప్రాంతం కావడం గమనార్హం.
 



International