imageతొలి డిజిటల్‌ దేశంగా తువాలు దీవి!
→రాను రాను సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతుండటంతో ద్వీప దేశం తువాలు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
→భావితరాలకు సైతం వీరి సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా తువాలు డిజిటల్‌ దేశంగా మారనుంది. 
 
→పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఏటా చేస్తున్న తీర్మానాలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. 
 
→కర్బన ఉద్గారాల కారణంగా నీటి మట్టాలు పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ద్వీప దేశాల భూభాగాలు సముద్రంలో కలిసిపోనున్నాయి. 
 
→ఈ నేపథ్యంలో త్వరలో తమ దేశాన్ని డిజిటల్‌ దేశంగా మారుస్తామని తువాలు ఐలాండ్‌ ప్రకటించింది. 
 
→ఆస్ట్రేలియా, హవాయిల మధ్య తొమ్మిది దీవుల సమూహంగా ఉన్న తువాలులో 12 వేల మంది జనం నివసిస్తున్నారు. 
 
→ఈ దీవి రాజధాని ప్రాంతం ఇప్పటికే 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి తువాలు పూర్తిగా కనుమరుగు కావడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్‌ వార్మింగుకు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 
→రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా మెటావర్స్‌ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చని ఆ దేశ న్యాయ, సమాచార, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సైమన్‌ కోఫే తెలిపారు. 
 
→త్వరలోనే తువాలు తొలి వర్చువల్‌ దేశంగా ప్రపంచ ప్రజలకు దర్శనమివ్వబోతోందని చెప్పారు. 
 
→ది మంకీస్, కొల్లైడర్‌ అనే రెండు సంస్థలు సాంకేతిక పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. 
 
→ఇందులో తువాలు చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్లు, సంస్కృతీ సంప్రదాయాల వివరాలు, కుటుంబ చిత్రాలు, సంప్రదాయ పాటల వంటి వాటిని నిక్షిప్తం చేయనున్నారు. 
 
→ఒక దేశం పూర్తిగా మెటావర్స్‌ సాంకేతికతలోకి మారడం ఇదే తొలిసారి కానుంది.
 International