image



ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేటైన‌ అజయ్‌ బంగా




→ప్రముఖ భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్ష స్థానానికి నామినేట్‌ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. 
 
→ఆయన నామినేషన్‌కు ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. 
 
→దీంతో ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా, సిక్కు అమెరికన్‌గా బంగా చరిత్ర సృష్టిస్తారు. 
 
→ఆయన వయసు 63 ఏళ్లు. ప్రస్తుతం జనరల్‌ అట్లాంటిక్‌ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. 
 
→గతంలో మాస్టర్‌కార్డ్‌ అధ్యక్షుడు - సీఈవోగా విధులు నిర్వర్తించారు. 2016లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. 
 
→అత్యంత కీలకమైన ప్రస్తుత సమయంలో ప్రపంచ బ్యాంకును ముందుండి నడిపించగల సామర్థ్యం బంగాకు ఉందని బైడెన్‌ పేర్కొన్నారు. 
 
→మూడు దశాబ్దాల పాటు పలు అంతర్జాతీయ కంపెనీలను విజయవంతంగా నడిపించిన అనుభవం ఆయన సొంతమని వ్యాఖ్యానించారు.
 



International