image



కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసిన సియాటెల్‌




→అమెరికాలో అమలవుతున్న ‘వివక్ష వ్యతిరేక చట్టంలో’ కులాన్ని కూడా చేర్చిన మొదటి నగరంగా సియాటెల్‌ నిలిచింది. 
 
→దీనికి సంబంధించి స్థానిక సభలో ప్రవాస భారతీయురాలు, సియాటెల్‌ నగర కౌన్సిల్‌ సభ్యురాలు క్షమా సావంత్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 
 
→జాత్యహంకారం కంటే కుల వివక్ష భిన్నంగా లేదని అందువల్ల దీనిని కూడా చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. 
 
→సియాటెల్‌ సిటీ కౌన్సిల్‌ 6-1 ఓట్లతో దాన్ని ఆమోదించింది. 
 
→ఈ నిర్ణయంతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లోని కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుందని కౌన్సిల్‌ వెల్లడించింది.
 



International