image



బంగ్లాదేశ్‌ నూతన అధ్యక్షుడిగా చుప్పూ




→బంగ్లాదేశ్‌ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్‌ షహాబుద్దీన్‌ చుప్పూ ఎన్నికయ్యారు. 
 
→ఈ మేరకు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
→అవామీ లీగ్‌ పార్టీ తరపున చుప్పూ పోటీ చేశారని, ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నామని తెలిపింది. 
 
→74 ఏళ్ల వయసున్న చుప్పూ ప్రస్తుతం అవామీ లీగ్‌ పార్టీ అడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
 



International