image



దక్షిణాఫ్రికాలో విపత్తు అత్యయిక స్థితి




→దక్షిణాఫ్రికాను తీవ్ర విద్యుత్‌ సంక్షోభం చుట్టుముట్టడంతో దేశంలో విపత్తు అత్యయిక స్థితి (స్టేట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌)ని విధిస్తున్నట్లు అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా ప్రకటించారు. ఆస్పత్రులు, తాగు నీటి సరఫరా వ్యవస్థలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
→దక్షిణాఫ్రికాకు ఏకైక విద్యుత్‌ సరఫరా సంస్థ అయిన ఎస్కామ్‌ దివాళా తీయడంతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 
 
→సమస్యను అధిగమించడానికి ప్రత్యేకంగా విద్యుత్‌ శాఖా మంత్రిని నియమిస్తామని రామఫోసా తెలిపారు. 
 
→ఎస్కామ్‌ ఇప్పటికే పొరుగు దేశాల నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుందని, ప్రైవేటు సంస్థలను కూడా విద్యుదుత్పత్తి కార్యకలాపాలకు అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. 
 
→9,000 మెగావాట్లను ఉత్పత్తి చేసే 100 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
 



International