image



పాకిస్థాన్‌కు రూ.8,250 కోట్ల రుణ సాయం




→తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఉద్దీపన ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్న పాకిస్థాన్‌కు పెద్ద ఊరట లభించింది.
 
→ ఓ దశలో సంక్లిష్టంగా మారిన ఇరు పక్షాల చర్చలు ఎట్టకేలకు కొలిక్కిరావడంతో అధికారుల స్థాయి ఒప్పందంపై సంతకాలు చేశారు. 
 
→ పాక్‌ కష్టాలు గట్టెక్కి ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడినపడేలా రూ.8,250 కోట్ల (ఒక బిలియన్‌ డాలర్లు) రుణ సాయం ఆ దేశానికి అందనుంది. 
 
→ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌తో సమావేశమైన ఐఎంఎఫ్‌ ప్రతినిధుల బృందం ఒప్పందం గురించి ఆయనకు తెలియజేసింది. 
 
→ ప్రభుత్వ వర్గాల కథనం మేరకు ఇరు పక్షాలు రుణ షరతులపై ఓ అవగాహనకు రావడంతో ఈ ఒప్పందాన్ని ప్రధాని వెంటనే ఆమోదించారు.
 



International