image



యూఏఈ, ఫ్రాన్స్‌లతో భారత్‌ త్రైపాక్షిక సహకారం




→ఉక్రెయిన్‌ యుద్ధం అనిశ్చితిలో అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఉన్న నేపథ్యంలో భారత్‌ మరో కీలక కూటమి దిశగా ఫ్రాన్స్, యూఏఈలతో వివిధ రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించుకుంది. 
 
→ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు ఒక సంయుక్త ప్రకటన చేశాయి. 
 
→భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, ఫ్రెంచ్‌ మంత్రి కేథరిన్‌ కలోనా, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌లు ప్రకటన విడుదల చేశారు. 
 
→ఇందులో రక్షణ, ఇంధన, ఆహార భద్రతా రంగాల్లో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించారు. 
 
→ఈ త్రైపాక్షిక సహకారానికి గత ఏడాది సెప్టెంబరు 19న ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల వేదికగా ఈ ముగ్గురు విదేశాంగ మంత్రులు కలిశారు.
 



International