imageకరెన్సీ నోటుపై బ్రిటన్‌ రాజముద్ర తొలగింపు
 
→తమ దేశ ఐదు డాలర్‌ల కరెన్సీ నోటుపై ఇక నుంచి బ్రిటన్‌ రాజు చిత్తరువుని ముద్రించబోమని ఆస్ట్రేలియా సెంట్రల్‌ బ్యాంకు ప్రకటించింది. 
 
→బ్రిటన్‌ రాజ వంశంతో ముద్రిస్తున్న చివరి కరెన్సీ నోటు ఇదే కావడంతో తాజా నిర్ణయంతో ఇక నోట్లపై రాజవంశ ఆనవాళ్లు కనపడవు. 
 
→ఆ స్థానంలో తమ దేశ మూలవాసుల సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త నోట్లను ఆస్ట్రేలియా ముద్రించనుంది. 
 
→నాణేలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. 
 
→ప్రస్తుత బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌ 3 రూపు ఉన్న నాణేలు త్వరలోనే విపణిలోకి వస్తాయని వివరించింది. 
 
→ఆస్ట్రేలియా పూర్తి స్వతంత్ర దేశమే అయినప్పటికీ బ్రిటన్‌ రాజ వంశం పేరు మీదుగానే పాలన సాగడం సంప్రదాయంగా వస్తోంది.
 International