→ అమెరికాలో కాంగ్రెస్ సభ్యులైన నలుగురు భారతీయ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్ ప్యానెల్స్ సభ్యులుగా నియమించారు.
→ ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్ జుడీషియరీ కమిటీ ప్యానెల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యులు ప్రమీల జయపాల్ నియమితులయ్యారు.
→ ఇంటెలిజెన్స్ వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమీ బెరా నియమితు లయ్యారు.
→ అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
→ అమెరికా సహా ప్రపంచ దేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యు డిగా రాజా కృష్ణమూర్తి నియమితులయ్యారు.
→ అమెరికా చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా రో ఖన్నా నియమితుల యారు.
International