image



దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు




→దక్షిణాఫ్రికాతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 12 చీతాలను జోహెన్నెస్బర్గ్ నుంచి సి-17 వాయుసేన విమానంలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు తీసుకొచ్చారు. 
 
→వీటిని గ్వాలియర్ నుంచి శ్యోపుర్ జిల్లా లోని కునో జాతీయ పార్కుకు తరలించారు..
 
→మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చీతా  లను కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు.
 
→మొత్తంగా ఏడు మగ, అయిదు ఆడ చీతాలున్నాయి.
 
→దేశంలో ఏడు దశాబ్దాల కిందటే అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతి పునరుద్ధరణకు 2009లో అప్పటి యూపీఏ ప్రభు త్వంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరామ్ రమేశ్ 'ప్రాజెక్ట్ చీతా'కు శ్రీకారం చుట్టారు.
 
→ఈ ప్రాజెక్టులో భాగంగా తొలివిడత కింద నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను (3 మగ, 5 ఆడ) 2022, సెప్టెం బరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు.
 
→700 చదరపు కిలోమీటర్ల కునో పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20 (10 - 10)కు చేరుకుంది.
 



International