image



సింగపూర్ పే నౌ, భారత యూపీఐ కనెక్టివిటీ ఆవిష్కరణ




→సింగపూ రు కు చెందిన పే నౌ, భారత్ కు చెందిన యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) మధ్య సీమాంతర అనుసంధాన తను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు.
 
→ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని లీ హిసియన్ లూంగ్ సమక్షంలో యూపీఐ పే నౌ లింకేజీని ఉపయోగించి ఆర్బీఐ గవ ర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ మానిటరీ అథారిటీ (ఎంఎఎస్) ఎండీ రవి మీనన్ లాంచనంగా లావాదేవీ జరిపారు.
 
→2018లో ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్లో పర్యటించినప్పుడు పే నౌ, యూపీఐని అనుసంధానించే ఆలోచనకు బీజం. పడిందని సింగపూర్ ప్రధాని లీ లూంగ్ వెల్లడించారు.
 
→భారత్, సింగపూర్ మధ్య ఏటా ఒక బిలియన్ డాలర్లకు పైగా సీమాంతర రిటైల్ చెల్లింపులు, రెమిటెన్యూల లావాదేవీలు జరుగుతున్నాయి. 
 
→ఇరు దేశాల ప్రజలు మొబైల్ ఫోన్ ద్వారా చౌకగా సీమాంతర లావాదేవీలు జరిపేందుకు యూపీఐ పే నౌ అనుసంధానం తోడ్పడగలదని మోదీ పేర్కొన్నారు.
 
→వ్యక్తుల మధ్య సీమాంతర చెల్లింపులు జరిపేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశంగా సింగపూర్ నిలిచింది..
 
→RBI, ఎంఏఎస్, ఎన్పీసీఐ, ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఐపీఎల్), బ్యాంకింగ్ కంప్యూటర్ సర్వీసెస్ (బీసీఎస్), ఇతరత్రా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు కలిసి యూపీఐ, పే నౌ లింకేజీని తీర్చిదిద్దాయి. 
 
→దీంతో ఇరు దేశాల ప్రజలు తమ మొబైల్ యాప్ల ద్వారా సురక్షితంగా సీమాంతర నిధుల బదలాయింపు లావాదేవీలు చేయవచ్చు. 
 
→తమ ద్వారా జీతాలు లేదా ఈ వాలెట్లలో డబ్బును యూపీఐ, పే నౌ మొబైల్ నంబరు వర్చువల్ పేమెంట్స్ అడ్రస్ (వీపీఏ) ద్వారా పంపించవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. 
 
→దీని ప్రకారం తొలి దశలో భారతీయ యూజర్లు. రోజుకు రూ.60 వేల వరకు (1000 సింగపూర్ డాలర్లు) పంపించొచ్చు.
 



International