image



అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగా రిచర్డ్‌ వర్మ




→అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరికన్‌ కీలక పదవిని చేపట్టనున్నారు. అమెరికా విదేశాంగ శాఖలో శక్తిమంతమైన డిప్యూటీ సెక్రటరీ (నిర్వహణ, వనరులు) పదవికి ప్రముఖ న్యాయవాది, దౌత్యవేత్త రిచర్డ్‌ వర్మ (54) నామినేషన్‌ను సెనెట్‌ ఆమోదించింది.
 
→ఈ మేరకు నిర్వహించిన ఓటింగ్‌లో 67-26 మెజార్టీతో ఆమోదం తెలిపింది. ఈ హోదాను విదేశాంగ శాఖ సీఈవోగా పరిగణిస్తారు. 
 
→ రిచర్డ్‌ వర్మ 2015 - 2017 మధ్య భారత్‌లో అమెరికా రాయబారిగా సేవలు అందించారు.
 
→ప్రస్తుతం మాస్టర్‌కార్డ్‌ సంస్థకు ప్రధాన న్యాయ వ్యవహారాల అధికారిగా, ప్రపంచ ప్రజా విధానాల విభాగ అధిపతిగా ఉన్నారు.
 
→ఒబామా హయాంలో విదేశాంగ శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీ (చట్ట వ్యవహారాలు)గా వ్యవహరించారు. అంతకు ముందు సెనెటర్‌ హారీ రెడ్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా సేవలందించారు.
 
→ఆసియా గ్రూప్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరికొన్ని సంస్థల్లోనూ వివిధ హోదాల్లో కొనసాగారు. అమెరికా వైమానిక దళంలో జడ్జి అడ్వొకేట్‌గా పనిచేశారు. అధ్యక్షుడి నిఘా సలహా బోర్డులో సేవలందించారు.
 
→సామూహిక విధ్వంస ఆయుధాలు, ఉగ్రవాద నిరోధక కమిషన్‌లో సభ్యుడిగా కొనసాగారు. ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ట్రస్టీగానూ, మరికొన్ని సంస్థల బోర్డుల్లో సభ్యుడిగానూ ఉన్నారు.
 
→అమెరికాకు వలస వచ్చిన ఓ భారతీయ కుటుంబంలో 1968లో జన్మించిన రిచర్డ్‌ వర్మ పెన్సిల్వేనియాలో పెరిగారు.
 
→జార్జిటౌన్‌ యూనివర్సిటీ లా సెంటర్‌లో న్యాయవాద విద్యలో పీజీ, జార్జిటౌన్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. తన సేవలకుగానూ విదేశాంగ శాఖ, విదేశీ వ్యవహారాల మండలి, వైమానిక దళం నుంచి పురస్కారాలు అందుకున్నారు.
 



International